గవర్నర్ తమిళిసైని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

వెంట స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ

CM Revanth Reddy meets Governor Tamilisai

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. మధ్యాహ్నం రాజ్ భవన్ వెళ్లిన సీఎం… ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ముఖ్యమంత్రితో పాటు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. పుష్పగుచ్ఛం ఇచ్చి సీఎం… గవర్నర్ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆ తర్వాత గవర్నర్‌కు సీతక్క శాలువా కప్పి సత్కరించారు. కొండా సురేఖ నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్‌కు ఓ పూల మొక్కను అందించారు. ఆ తర్వాత కాసేపు కూర్చొని ముచ్చటించారు. కాగా, గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డిలు ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.