యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో సీఎం కెసిఆర్

యాదాద్రి: సీఎం కెసిఆర్‌ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా సీఎం కెసిఆర్‌ పంచనారసింహ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వద్ద ముఖ్యమంత్రి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం సీఎం కెసిఆర్‌ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. పనులను పరిశీలించిన తర్వాత గుడి ప్రారంభం తేదీని కూడా సీఎం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/