1800కి పైగా కొవిడ్‌-19 మృతులు

Coronavirus
Coronavirus

బీజింగ్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య 1868కి చేరుకుంది. ఈవైరస్‌ రోజు రోజుకూ విస్తరిస్తుంది. చైనాలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 72 వేల 436 కేసులు నమోదయ్యాయి. దీంట్లో 11 వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కరోనా కేంద్ర బిందువైన హుబేరు ప్రావిన్సులోనే అత్యధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రావిన్సులో చాలా వరకు ప్రాంతాలను క్వారెంటైన్‌ చేశారు. దిగ్భంధం వల్ల లక్షలాది సంఖ్యలో జనం ఎటు వెళ్లకుండా ఉండిపోయారు. హుబేరు ప్రావిన్సు మినహా మిగితా దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజువారీగా తగ్గుతున్నట్లు జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కాగా కరోనా వైరస్‌( కోవిడ్‌19 ) సోకిన వారిలో సుమారు 12 వేల మంది పేషెంట్లు కోలుకున్నట్లు అధికారులు చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/