నేడు సిద్దిపేట, సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు. ఇప్పటికే హుస్నాబాద్ , భువనగిరి , జనగాం జిలాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి ప్రజలను మరోసారి బిఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరగా..నేడు సిద్దిపేట, సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలు , అధికారులు ఈ సభలకు సంబదించిన ఏర్పాట్లను పూర్తి చేసారు.

ముందుగా సిరిసిల్ల బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో, ఆ తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇందుకోసం రెండు పట్టణాలను కేటాయించారు. సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అర కిలోమీటరు దూరంలోని విశాలమైన స్థలంలో బీఆర్ ఎస్ పార్టీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల కటౌట్లతో సిరిసిల్ల పట్టణం గులాబీమయమైంది.

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సభా స్థలం, పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. జనసమీకరణ లక్ష్యంగా మండల, గ్రామాలకు ఇన్ చార్జిలను నియమించారు. ఎన్నికల నగారా మోగిన అనంతరం సిద్దిపేటలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభకు పార్టీ నేతలు, శ్రేణులు హాజరుకానున్నారు. ప్రజా ఆశీర్వాద సభకు పెద్దఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.