‘ధరణ’ పై నేడు సిఎం కెసిఆర్‌ సమీక్ష

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: నేడు సిఎం కెసిఆర్‌ ధరణి, రిజిస్ట్రేషన్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ధరణి సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై అధికారులతో చర్చించనున్నారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుంటారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సిఎం కెసిఆర్‌ తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈ సమావేశంలో సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/