సర్వ జీవకోటికి చెట్లే జీవనాధారం

ములుగు మండలం సింగయాపెల్లిలో హరితహారం పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

harish rao
harish rao

సిద్ధిపేట: మంత్రి హరీష్‌రావు ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లాలోని ములుగు మండలం సింగయాపెల్లిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిత తెలంగాణగా మార్చడం ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంకల్పం అని పేర్కొన్నారు. సర్వ జీవకోటికి చెట్లే జీవనాధారమని హరీష్‌రావు అన్నారు. అయితే గాలి కాలుష్యంతో రకరకాల రోగాలు వస్తున్నాయని..మనిషి మనుగడకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నాటినట్లయితే ఆరోగ్యవంతమైన మనిషిగా బ్రతకడానికి అవకాశం ఉందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/