రేపు ప్రధానితో ఏపీ సీఎం భేటీ

రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చ

AP CM YS Jagan
AP CM YS Jagan

Amaravati: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి పయనం అవుతున్నారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి వివరిస్తారు. కొత్త జిల్లాల ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆంటీ కాకుండా, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా ప్రధాని తో మాట్లాడతారని తెలిసింది. ఇదిలా ఉండగా, కొత్త జిల్లాలు ఏర్పాటు అనంతరం , మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణకు ముందు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పొలవరం ప్రాజెక్టు, పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై మోడితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, కేంద్ర మంత్రి అమిత్‌షాతోనూ సీఎం భేటీకి సీఎంవో అపాయింట్‌మెంట్‌ కోరింది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హస్తిన పర్యటనలో ఉన్నారు.. ఇప్పుడు ఏపీ సీఎం కూడా వెళ్లనుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి ఢిల్లీకి చేరుకోవడం చర్చనీయాంశమైంది.

‘చెలి'(మహిళల ప్రత్యేకం) శీర్షికల కోసం: https://www.vaartha.com/specials/women/