చిన‌జీయ‌ర్ స్వామిని క‌లిసిన సీఎం కేసీఆర్ దంపతులు

పూర్ణ కుంభాలతో స్వాగతం పలికిన వేద పండితులు

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబ స‌మేతంగా సోమ‌వారం మ‌ధ్యాహ్నం వెళ్లారు. ముచ్చింత‌ల్ ఆశ్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వేద‌పండితులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను శాలువాల‌తో చిన‌జీయ‌ర్ స్వామి స‌త్క‌రించి, వారిని ఆశీర్వ‌దించారు. భగవత్ రామానుజాచార్యుల ప్రాజెక్ట్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ‘సమతా మూర్తి’ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చినజీయర్ స్వామి ఇప్పటికే ఆహ్వానించారు. చినజీయర్ ఆశ్రమంలోనే 216 అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/