స్పీకర్ పోచారం కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి

ప్రైవేట్ ఉద్యోగి నర్సింహారెడ్డిగా గుర్తింపు

హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ లోని కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి మరణించాడు. అతడిని నర్సింహారెడ్డి(50) గుర్తించారు. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/