భారత్‌లో కొత్తగా 53,601 కేసులు నమోదు

మొత్తం కేసులు 22,68,676..మొత్తం మృతుల సంఖ్య 45,257

భారత్‌లో కొత్తగా 53,601 కేసులు నమోదు
corona virus – india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..  గత 24 గంటల్లో భారత్‌లో 53,601 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 22,68,676 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 45,257 కి పెరిగింది. 6,39,929  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 15,83,490  మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,45,83,558 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,77,023  శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/