ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం కేసీఆర్

cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయలుదేరారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు వెళ్లిన సీఎం కేసీఆర్, అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. తొమ్మిది రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీ లోనే మకాం వేశారు. ఈ తొమ్మిది రోజులుగా కేసీఆర్ పలువురు రైతు సంఘాల నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ఎంపీలతో చర్చలు జరిపారు. బీఆర్‌ఎస్‌, టీఆర్ఎస్ కార్యాలయాల పనులను దగ్గర ఉండి పరిశీలించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిపాలన, ప్రభుత్వ పథకాల ప్రచారం, నిధుల సమీకరణపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో ఢిల్లీ లోనే చర్చలు జరిపారు.

ఇదిలా ఉంటె ఈ నెల 30న మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న కేసీఆర్.. చండూరులో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపటి నుండి మునుగోడు ఉపఎన్నికపై కేసీఆర్ దృష్టి పెడతారని తెలుస్తోంది. బహిరంగ సభ నిర్వహణ, ప్రచారపర్వం గురించి నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో సీఎంవో అధికారులు పర్యటిస్తున్నారు. కేసీఆర్ బసకి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వారం పాటు మునుగోడులోనే ఉండి కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారని చెబుతున్నారు. అందుకోసం చండూరు, చౌటుప్పల్, మునుగోడు ప్రాంతాల్లో కేసీఆర్ బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు.