ఢిల్లీకి చేరుకున్న కరోనా వ్యాక్సిన్

స్పైస్ జెట్ ట్వీట్

Corona vaccine arrives in Delhi
Corona vaccine arrives in Delhi

New Delhi: దేశం నలుమూలలకూ కరోనా వ్యాక్సిన్ చేరుకుంటున్నది. ఈ ఉదయం పుణె నుంచి వ్యాక్సిన్ లోడ్ తో బయలు దేరినన స్పైస్ జెట్ విమానం కొద్ది సేపటి కిందట ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.

ఈ విషయాన్ని స్పైస్ జెట్ ట్వీట్ చేసింది. దేశం నలుమూలలకూ వ్యాక్సిన్ రవాణా చేసే అవకాశం లభించడం గర్వకారణంగా పేర్కొంది. సకాలంలో దేశంలోని అన్ని నగరాలకూ వ్యాక్సిన్ ను చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. 

Corona vaccine arrives in Delhi

అన్ని రాష్ట్రాలకూ టీకాను చేర్చేందుకు పలు లాజిస్టిక్ సంస్థలు, ఎయిర్ లైన్స్ కంపెనీలు, విమానాశ్రయాలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తోంది.

ఈ తెల్లవారుజామున మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పూణె ఎయిర్ పోర్టుకు వ్యాక్సిన్ చేరుకోగా, వాటిని వివిధ నగరాలకు తరలించారు.  ఇ . ఒక్కోటి 32 కిలోల బరువుండే బాక్స్ లు 478 వరకూ దేశంలోని వివిధ నగరాలకు దాదాపు చేరిపోయాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/