కొండకల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సిఎం కెసిఆర్

cm-kcr-inaugurates-railway-coach-factory-at-kondakal

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ రంగారెడ్డి జిల్లా కొండల్‌ వద్ద నిర్మించిన మేథా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని గురువారం ప్రారంభించారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధా గ్రూప్‌ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనున్నది. రైల్‌ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా నిలువనున్నది. కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎ కేసీఆర్‌ కర్మాగారంలో మిషన్లను పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు వాటి పనితీరును సీఎంకు వివరించారు. కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు కెటిఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మేథా ఎండీ కశ్యప్‌రెడ్డి ఉన్నారు.