మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు..

AP CID Issued Notices to Former Minister Narayana

టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీచేశారు. అమరావతి భూముల వ్యవహారంలో నారాయణకు CRPC 41ఏ కింద అధికారులు నోటీసులిచ్చారు. మార్చి 6న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్‌ ఎండీ అంజనీకుమార్‌, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్‌, వరుణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు నోటీసులో అధికారులు పేర్కొన్నారు.

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం సందర్భంగా తయారు చేసిన అలైన్ మెంట్లో మార్పులు చేసి లబ్ది పొందారన్న ఆరోపణల్ని మాజీ మంత్రి నారాయణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కోర్టు అనుమతితో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.