‘మెగాస్టార్ 152’లో మోహన్ బాబు ?

Chiranjeevi- Mohan babu (File)

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించినట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాలో నటించడానికి మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది చూడాలి.  చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/