రేయ్ జగన్.. నీకు మానవత్వం లేదురా.. అంటూ 30 ఇయర్స్ పృద్వి కామెంట్

రేయ్ జగన్.. నీకు మానవత్వం లేదురా.. అంటూ 30 ఇయర్స్ పృద్వి చెప్పిన డైలాగ్ పొలిటికల్ గా హాట్ టాపిక్ అయ్యింది. కాకపోతే ఇది ఓ వెబ్ సిరీస్ లో చెప్పిన డైలాగ్..కానీ ఇది పొలిటికల్ గా పేలింది. ఈ మధ్య సినిమాల్లోని డైలాగ్స్ ప్రభుత్వాల పనితీరు ఫై పేల్చినట్లు అనిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణ బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి నే. ఈ మూవీ లో కొన్ని డైలాగ్స్ బాలయ్య చెపుతుంటే..అధికార పార్టీ వైస్సార్సీపీ ఫై చేసినట్లే అనిపిస్తుంటుంది. దీనిపై పెద్ద రచ్చే నడిచింది.

ఇక ఇప్పుడు మరో డైలాగ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దిల్ రాజు ప్రొడక్షన్లో హరీష్ శంకర్ కథను అందించిన ఏటీఎం వెబ్ సిరీస్ రీసెంట్ గా జీ ఫైవ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి చేసిన కొన్ని డైలాగ్స్ కూడా రాజకీయాలకు టచ్ అయ్యేవిధంగా ఉన్నాయి అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక సన్నివేశంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి ఆగ్రహం తో రేయ్ జగన్.. నీకు మానవత్వం లేదురా.. అంటూ చేసిన విధానం హాట్ టాపిక్ గా మారిపోయింది. అతను ఎవరిని టార్గెట్ చేసే ఆ మాట అన్నాడు అర్థమైంది అంటూ మరికొందరు ఊహించని విధంగా రియాక్ట్ అవుతున్నారు.

సినిమాల్లో అగ్ర కామెడియాన్ గా రాణిస్తున్న టైం లో పృద్వి వైస్సార్సీపీ లో చేరి..పార్టీ ప్రచారం లో పాల్గొన్నారు. ఆ తర్వాత పలు కారణాలతో బయటకు వచ్చారు. ప్రస్తుతం జనసేన పార్టీ కి మద్దతు ఇస్తున్నారు.