గిరిజన సమస్యలపై వికారాబాద్ లో 23న సదస్సు

మాజీ ఎంపీ రవీందర్‌ నాయక్ వెల్లడి

Ravindar Naik- Ex MP
Ravindar Naik- Ex MP

Hyderabad: రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ , పోడు భూముల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై వికారాబాద్‌లో టైబల్‌ ఫెడరేషన్‌ 23న సభను నిర్వహించబోతున్నది.

తండాలను పంచాయతీలుగా, రెవెన్యూ గ్రామాలుగా గుర్తిస్తామన్న సీఎం కేసీఆర్‌ మాట తప్పారని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ రవీందర్‌ నాయక్ విమర్శించారు.

అర్హులైన గిరిజన రైతులకు మూడెకరాల భూమి , డబుల్‌ బెడ్రూం ఇళ్లు, జిల్లాకో గిరిజన భవనం, ఐటీడీఓ ఏర్పాటు, ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, గిరిజన సమరయోధులను పాఠ్యాంశాల్లో చేర్చాలని, గిరిజన మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/