సిఎం కెసిఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య

సాంకేతిక లోపం గుర్తించి అప్రమత్తమైన పైలట్

cm-kcr-helicopter-emergency-landing-due-to-technical-fault

హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారం కోసం కెసిఆర్ కొద్దిసేపటి క్రితమే దేవరకద్రకు బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన కాసేపటికి సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే హెలికాఫ్టర్ ను ఎర్రవల్లికి మళ్లించారు. సిఎం కెసిఆర్ ఫాంహౌస్ లోని హెలిప్యాడ్ పై క్షేమంగా దించారు. సిఎం కెసిఆర్ ప్రయాణానికి మరో హెలికాఫ్టర్ ను సిద్ధం చేస్తున్నట్లు ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.