చంద్రబాబు కు చిరంజీవి, పవన్ కళ్యాణ్ విషెష్

Chandra babu Naidu
Chandra babu Naidu

తెలుగుదేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా పార్టీ నేతలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. పలు సేవ కార్య క్రమాలు చేపడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా లోను సినీ , రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెష్ అందజేస్తున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా చంద్రబాబు విషెష్ అందజేశారు.

“శ్రీ నారా చంద్రబాబు నాయుడు @CBN గారికి జన్మ దిన శుభాకాంక్షలు.. వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేసారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

‘మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ చంద్రబాబు గారికి భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను’అన్నారు. చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను జనసేన పార్టీ ట్విట్టర్ అఫిషియల్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.