కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఫై మరో హెల్త్ బులిటిన్

సూపర్ స్టార్ కృష్ణ కు గుండెపోటు రావడంతో సోమవారం తెల్లవారు జామున కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ హాస్పటల్ లో చేరారని విషయం తెలిసి సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కృష్ణ ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌ వర్గం కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఫై బులిటిన్ విడుదల చేయడం జరిగింది.

నిన్న రాత్రి కృష్ణ గారు గుండెపోటు తో హాస్పటల్ లో జాయిన్ అయ్యారని , 48 గంటలైతే గాని ఏంచెప్పలేమని డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటీలేటర్‌ పై ఉన్నారని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ గారు అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారని , ప్రతి గంట కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. సాయంత్రం మరో బులిటిన్ విడుదల చేసారు. కృష్ణ గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరినా.. కిడ్నీ, లివర్ లాంటి కొన్ని అవయవాలు కూడా దెబ్బతినడంతో పరిస్థితి క్రిటికల్‌గా మారిందని వివరించారు. అన్నిరకాల స్పెషలిస్ట్ డాక్టర్లు కృష్ణ ఆరోగ్య పరిస్థితిని నిషితంగా పర్యవేక్షిస్తున్నారని.. రేపు ఉదయం మరోసారి మీడియా ముందుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణ కుటుంబ సభ్యులు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాస్పటల్ కు చేరుకుంటున్నారు. మహేష్ , నమ్రత , నరేష్ తదితరులంతా హాస్పటల్ లోనే ఉంటూ ప్రతి క్షణం డాక్టర్స్ తో టచ్ లో ఉంటున్నారు.