ఉపరాష్ట్రపతికి సిఎం కెసిఆర్‌ శుభాకాంక్షలు

vice-president-cm

హైదరాబాద్‌: నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సిఎం కెసిఆర్‌ ఉపరాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్‌ ద్వారా సిఎం శుభాకాంక్షలు అందజేశారు. అదేవిధంగా ఓ పూల బొకేను పంపించారు. వెంకయ్యనాయుడు ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం గడపాలని సిఎం ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో, సంవత్సరాల్లో దేశానికి సేవలు మరింతగా కొనసాగించాలని కోరుకుంటున్నట్లు సిఎం పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/