నిజామాబాద్‌లో చిరుత కలకలం

తెలంగాణ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

Leopard
Leopard

నిజామాబాద్‌: ఈ మధ్య వన్యప్రాణులు తరచూ జనావాసాలు ఉన్న ప్రదేశాలకు రావడం తెలిసిన విషయమే. తాజాగా నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలోకి ఓ చిరుత వచ్చింది. విషయం పై అధికారులకు తెలిసింది. వాళ్లు వెంటనే అలర్ట్ నోటీస్ జారీ చేసి… శుక్రవారం, శనివారం (జనవరి 10, 11) జరగాల్సిన సెమిస్టర్ ఎగ్జామ్స్‌ని వాయిదా వేసి… జనవరి 22, 23న నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ యూనివర్శిటీ డిచ్‌పల్లి మండలంలో సుధాపల్లి గ్రామంలో… 540 ఎకరాల్లో విస్తరించి ఉంది. క్యాంపస్‌లో రెండువైపులా దట్టమైన చెట్లు దాదాపు అడవిలా విస్తరించాయి. శుక్రవారం ఉదయం… ఎంఏ స్టూడెంట్ స్వామి… మార్నింగ్ వాక్‌కి వెళ్లి… చిరుత పులిని చూశాడు. వెంటనే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నసీమ్‌కి చెప్పాడు. వెంటనే విషయం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, కలెక్టర్‌కి తెలిసింది. కొందరు రైతులు కూడా తాము చిరుత పులి గర్జించిన అరుపుల్ని విన్నామని చెప్పుకున్నారు. యూనివర్శిటీలో సాయంత్రం దాటితే యూనివర్శిటీ, క్యాంపస్ దాటి బయటకు రావద్దని స్టూడెంట్స్‌కి సూచించారు. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు… చిరుత కాళ్ల అచ్చుల్ని చూస్తూ… అది ఎటు వెళ్లిందో కనిపెడుతున్నారు. ప్రస్తుతానికి అది కనిపించట్లేదు. క్యాంపస్ చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో కూడా ఎక్కడా అది లేదు. తెలంగాణ యూనివర్శిటీలో నాలుగు హాస్టల్స్ ఉన్నాయి. 2000 మంది విద్యార్థులున్నారు. అందరూ ఎప్పుడు చిరుత వస్తుందోనని టెన్షన్‌లో ఉన్నారు. పోలీసులు రెగ్యులర్‌గా పెట్రోలింగ్ చెయ్యాలని… ప్రొఫెసర్ నసీమ్ కోరారు. హాస్టల్స్ దగ్గర పోలీస్ పికెట్స్ ఏర్పాటు చెయ్యాలని కూడా కోరారు. లక్కేంటంటే… జనవరి 11 (ఇవాళ్టి నుంచీ) 17 వరకూ యూనివర్శిటీకి సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఆలోగా చిరుతను పట్టేసుకుంటేపట్లుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/