భారీ స్థాయిలో సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు

పార్టీ కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపు

TS CM KCR birthday celebrations
TS CM KCR

Hyderabad: తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కే.చంద్రశేఖరరావు (కెసిఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల పాటు సీఎం కేసీఆర్‌ జన్మదిన సంబరాలు జరపాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈమేరకు కార్యాచరణను సిద్దం చేశారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశం యావత్తూ తెలంగాణ వైపు చూస్తున్న దశలో సీఎం కేసీఆర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేల ఈ సంబరాలు ఉండాలని పిలుపు నిచ్చారు. ఆయా కార్యక్రమాల వివరాలను పార్టీ శ్రేణులకు విడుదల చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల్లో పండ్లు పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ చేపట్టారు. బుధవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు కేటీఆర్‌ వెల్లడించారు. ఇందులో పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొని రక్తదానంలో పాల్గొనాలని కోరారు. 17న కెసిఆర్ జన్మదినం రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం నిర్వహిస్తామని చెప్పారు. ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా తమ తమ స్థాయిలో ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని పార్టీ కార్యకర్తలకు మంత్రి సూచించారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/