తెలంగాణ లో మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయం – ఉత్తర్వూలు జారీ చేసిన కేసీఆర్

తెలంగాణలోని మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయం చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో దళితబంధు , బిసి బంధు తీసుకొచ్చిన కేసీఆర్..ఇప్పుడు మైనారిటీల కోసం మైనారిటీ బంధు ను పేరుతో లక్ష రూపాయిల ఆర్ధిక సాయం చేస్తున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని , ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు. మైనారిటీల అభివృద్ధి , సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.