సీఎం జగన్‌ లండన్‌ పర్యటన..ఎయిర్‌ పోర్టులో అనుమనాస్పద వ్యక్తి అరెస్టు

CM Jagan’s visit to London..suspicious person arrested

అమరావతిః ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లండన్, స్విట్టర్లాండ్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన తాడేపల్లి నుంచి తొలుత గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లనున్నారు. మళ్లీ రాష్ట్రానికి జూన్ 1న రానున్నారు.

కాగా, సీఎం జగన్ లండన్ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నారై డాక్టర్ తుళ్లూరు లోకేశ్‌గా గుర్తించారు. జగన్ విదేశీ పర్యటనపై ఫోన్ ద్వారా పలువురికి మెసేజులు పంపినట్లుగా నిర్ధారణ అయింది. పోలీసులు ప్రశ్నించడంతో గుండెపోటు వచ్చిన లోకేశ్ తెలిపారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.