బీహార్‌ సిఎంగా నీతీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం

Nitish Kumar takes oath as Bihar chief minister

పట్నా: బీహార్‌ సిఎంగా జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ ఏడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగు చౌహీనన ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కాగా, బీహార్‌ సిఎంగా నితీష్‌కు ఇది వరుసగా నాలుగోసారి. మొత్తంగా ఇది ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 15 ఏళ్లుగా బిహార్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న నితీష్, తాజాగా జరిగిన ఎన్నికల్లో జేడీయూ-బిజెపి కూటమి విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జేడీయూ కంటే బిజెపి కి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముందుగా చెప్పినట్లుగానే నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుని మాట నిలబెట్టుకున్నారు.

బిజెపికి చెందిన రేణు దేవి, థార్ కిషోర్‌లు బిహార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బిహార్ అసెంబ్లీలో బిజెపి శాసనసభాపక్ష నేతగా థార్ కిషోర్, శాసనసభాపక్ష ఉప నేతగా రేణు దేవిని ఇప్పటికే ఎన్నుకన్నారు. ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం స్వీకారం చేసిన అనంతరమే వీరిద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/