నేడు వైయస్ఆర్-జగన్న కాలనీల ప్రాజెక్టును ప్రారభించనున్నసీఎం

15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం ప్రారంభోత్సవం

అమరావతి: ఏపీ సీఎం జగన్ నేడు ‘వైయస్ఆర్ జగనన్న కాలనీ’ల పథకాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని జగన్ ప్రారంభిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది.
ఇందులో భాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.


కాగా, ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే స్తోమత లేనివారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుంది. స్థలం ఉండీ కట్టుకోలేని వారికి అందుకయ్యే ఖర్చును తన వాటా కింద భరిస్తుంది. రాష్ట్రంలో ఇలాంటి వారు 4.33 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో భాగంగా నిర్మించే ఇళ్లు 340 చదరపు అడుగుల్లో ఉంటాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/