కొత్తగా ఏం చేయొచ్చో పాలుపోవ‌ట్లేదు: విజ‌య‌సాయిరెడ్డి

అమరావతి: బీజేపీ అధికారంలోకి వస్తే రూ.75లకే చీప్ లిక్కర్‌, ఇంకా కుదిరితే రూ.50లకే ఇస్తాం అని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లపై వైస్సార్సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. చౌకబాబు ప్రకటనలు గుప్పిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

”జగన్ గారి సంక్షేమ పథకాలతో ప్రజలు వేరే పార్టీలను ఆదరించే పరిస్థితి లేదు. కొత్తగా ఏం చేయొచ్చో పాలుపోక ‘చీప్ లిక్కర్’ పారిస్తామంటూ చౌకబాబు ప్రకటనలు గుప్పిస్తున్నారు. లిక్కర్ బ్రాండ్ల గురించి వాపోతారు. మరో పక్క అప్పులు తెచ్చి వెల్ఫేర్ స్కీములు నడపడమేమిటని విమర్శించేది వీళ్లే” అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/