ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు – మాజీ మంత్రి అనిల్ కుమార్

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్..మరోసారి ప్రతిపక్షాలఫై నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. శనివారం నెల్లూరు లో మీడియా తో మాట్లాడుతూ..కొడాలి నాని, నా పేరు లేక పోతే కొన్ని ఛానల్స్ కు న్యూస్ ఉండదని ఫైర్‌ అయ్యారు. 2024 ఎవరు గెలుస్తారో చూసుకుందాం..చిల్లర రాజకీయాలు మానండని కోరారు. అమావాస్యకు ఒకసారి తిరిగే వాళ్ళు కూడా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు చేశారు. చెత్త పన్నును చంద్రబాబే ప్రతిపాదించారన్నారు.

ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలుగుదేశం పై నేను కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తా.. రాయించ గలుగుతా.. కానీ ..అంత నీచంగా దిగజారి రాజకీయం చేయడం మాకు చేతకాదని అనిల్ విమర్శలు చేశారు. అలాగే పొత్తుల ఫై మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారో.. లేక వేరేవాళ్లతో కలిసి ఉంటారో..? కుదిరితే పెళ్లి చేసుకుంటారో వాళ్ల ఇష్టమని.. అది వైఆసఆర్సీపీ కి సంబంధం లేదన్నారు. ఎవరు.. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇక ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు. అయినా 75 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఏం ఉద్దరిస్తాడని ప్రశ్నించారు. ముస్లిలను జగన్ కు దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కేవలం కలలు కనడం.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప.. ఆయన చేసేది ఏం లేదన్నారు.