తెలంగాణకు వర్ష సూచన

వాతావరణ శాఖ వెల్లడి

Rain forecast for Telangana
Rain forecast for Telangana

Hyderabad: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని, ఈ కారణంగా తెలంగాణలో గురువారం నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. . హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/