ప్ర‌ధాని మోడికి సీఎం జగన్ మ‌రో లేఖ‌

అమరావతి : ప్రధాని నరేంద్ర మోడికి సీఎం జగన్ మ‌రో లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తుంద‌ని ఆరోపించారు. ఈ విష‌య‌మై జ‌ల‌శ‌క్తి, కేఆర్ఎంబీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వివాదాలు ప‌రిష్కారం కావ‌ట్లేదన్నారు. నీటి వినియోగాన్ని వెంట‌నే ఆపేలా చ‌ర్య‌లు చేపట్టాల‌ని కోరారు. ప్రోటోకాల్ పాటించ‌కుండా తెలంగాణ విద్యుదుత్ప‌త్తి చేస్తుంద‌న్నారు. కేఆర్ఎంబీ ప‌రిధిని నిర్ణ‌యించాల‌న్నారు. ఏపీ వాటా వినియోగానికి కేంద్రం జ‌ల‌శ‌క్తి జోక్యం చోసుకోవాల‌న్నారు. ఏపీ హ‌క్కులు కాపాడేందుకు కేంద్ర జ‌ల‌శ‌క్తి తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆదేశాలివ్వాల‌న్నారు. అదేవిధంగా ఉమ్మ‌డి ప్రాజెక్టుల వ‌ద్ద సీఐఎస్ఎఫ్ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/