మలయాళ ఇండస్ట్రీ లో విషాదం …నటి సుబి సురేష్ మృతి

మలయాళ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి సుబి సురేష్ (42) బుధువారం కన్నుమూశారు. గత కొద్ది రోజుల నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది ఈమె. జనవరి 28న సుబీని అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో చేర్చగా.. కామెర్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నందున చికిత్స కష్టంగా ఉందని అంతకుముందు ఆమె సన్నిహితురాలు చెప్పడం జరిగింది.

వాస్తవానికి ఆమెకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. కానీ, ఈ లోపే విషాదం చోటు చేసుకుంది. డ్యాన్సర్, కమెడియన్, యాంకర్ గా సుభి సురేష్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆమె నిర్వహించిన సినీమాల, కుట్టి పట్టాలం టీవీ షోలకు ఎంతో ఆదరణ వచ్చింది. ఎన్నో టీవీ షోలలో ఆమె కీలక పాత్ర పోషించారు. 20కు పైగా సినిమాల్లోనూ నటించారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా ఆమెకు పేరుంది. అయినా కానీ, కాలేయ అనారోగ్యంతో మృతి చెందడం అభిమానులకు విషాదాన్ని మిగిల్చింది.

ఇక సుభీ సురేష్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సంతాపం తెలిపారు. ‘కొచ్చిన్ కళా భవన్ ద్వారా కళారంగంలోకి ప్రవేశించిన సుబీ. రియాల్టీ షోస్, కామెడీ ప్రోగ్రామ్స్ ద్వారా మలయాళీల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సుబీ మృతితో ఒక మంచి ఆర్టిస్ట్‌ను కోల్పోయాం’ అని సీఎం పేర్కొన్నారు.