నేడు లండన్‌ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్‌

cm jagan

అమరావతిః ఏపీ సీఎం జగన్ ఈ రాత్రి లండన్ కు బయల్దేరుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల బిజీలో ఉన్న జగన్ విశ్రాంతి కోసం తన భార్య భారతితో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. ఈ రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ నుంచి లండన్ కు పయనమవుతున్నారు. జగన్ కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. లండన్ తో పాటు స్వాట్జర్లాంట్ లో కూడా ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 31న ఆయన విదేశాల నుంచి తిరిగొస్తారు.

విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును కోరారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే బెయిల్ కండిషన్ నేపథ్యంలో… ఆ షరతులను సడలించాలని కోర్టును జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్వట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతిని ఇవ్వాలని విన్నవించారు. జగన్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు… విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది.