లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు ఉదయం మధ్యస్థంగా కనిపించిన ట్రేడింగ్ క్రమంగా ఊపందుకుంది. కొనుగోళ్లు పెరగడంతో సూచీలు రివ్వున ఎగిశాయి. దీంతో ఐటీ విభాగం తప్పించి బ్యాంకింగ్, ఇన్ ఫ్రా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాల షేర్ల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. చివరి వరకు ట్రేడింగ్ ఇదే రీతిలో జరగడంతో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 41,613 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం పురోగతి కనబరుస్తూ 67 పాయింట్ల వృద్ధితో 12,248 వద్ద స్థిరపడింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/