పాన్‌కార్డు ఇవ్వకపోతే 20 శాతం పన్ను

న్యూఢిల్లీ: పాన్‌కార్డు గానీ, ఆధార్ కార్డుగానీ ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం వరకు లేదా అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) చేయాలని ఆదాయపు పన్ను శాఖ అన్ని సంస్థల యాజమాన్యాలకు మరోసారి వెల్లడించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులు తమ పాన్ కార్డు వివరాలను యాజమాన్యాలకు అందజేయాలి. ఒక వేళ ఇవ్వకపోతే 20 శాతం మొత్తం కానీ, చట్టంలో వర్తించే రేటు ప్రకారం గానీ ఏది ఎక్కువ అయితే అంత మొత్తాన్ని పన్ను రూపంలో వారి వద్ద నుంచి కత్తిరించాలి. తాజా సంవత్సరం చివరికి రావడంతో ఆయ సంస్థలు లెక్కలు సిద్ధం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రకటన రావడం గమనార్హం. సాధారణంగా 20 శాతం శ్లాబు కంటే తక్కువలోకి వచ్చే ఉద్యోగులు పాన్, లేదా ఆధార్ నంబర్ ఇవ్వకపోతే వారికి జీతంలో 20 శాతం పన్ను కోత విధిస్తారు. అదే 20 శాతం శ్లాబు దాటితే ఎంత అయితే అంత కోత విధించడంతో పాటు 4 శాతం హెల్త్, ఎడ్యూకేషన్ సెస్ కూడా వసూలు చేస్తారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/