వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకోవాలిః సిఎం జగన్‌

cm-jagan-to-attend-inaugural-of-icid-congress-plenary

అమరావతిః సాగునీటి కొరత వ్యవసాయానికి ప్రధాన సమస్యగా మారిందని సీఎం జగన్ చెప్పారు. విశాఖలో ఐసీఐడీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం అయింది. ఐసీఐడీ సదస్సులో సిఎం జగన్‌ మాట్లాడుతూ…”వర్షాలు కురిసేది తక్కువ కాలమే కాబట్టి ఒక బేసిన్ నుంచి మరో చోటుకు నీటిని తరలించి ఉపయోగించుకోవాలి. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం కావాలి. వ్యవసాయరంగ సమస్యలకు సదస్సులో నిపుణులు ఆమోదయోగ్య పరిష్కారాలు సూచించాలి” అని కోరారు. ఏపీలో రంగం సాగునీటి వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని..ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉందని వివరించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోందని చెప్పారు. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ ఐసీఐడీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభ కార్యక్రమానికి సీఎం జగన్‌, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్.. మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, అమర్నాథ్, దేశవిదేశాలకు చెందిన 1200 మంది ప్రతినిధులు హాజరయ్యారు.