రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

ఈరోజు వరకు బాబును అరెస్ట్ చేయకూడదని గత విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలు

high-court-adjourns-chandrababu-bail-petition-hearing-in-inner-ring-road-case

అమరావతిః ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణను ఈరోజు హైకోర్టు చేపట్టింది. ఈ విచారణకు హైకోర్టు కాస్త విరామం ప్రకటించింది. గత విచారణ సందర్భంగా ఈరోజు (7వ తేదీ) వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణకు చంద్రబాబు అన్ని విధాలా సహకరిస్తారని గత విచారణ సందర్భంగా ఆయన తరపు లాయర్లు హైకోర్టుకు తెలిపారు. మరోవైపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్ పై కూడా హైకోర్టు ఈ రోజు వరకు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.