జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ప‌థ‌కం నిధుల విడుద‌ల చేసిన సీఎం జగన్

అనంత‌పురం జిల్లా నార్ప‌ల వేదిక‌గా జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ప‌థ‌కం నిధులను విడుదల చేసారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేసారు. ఈ సందర్భగా జగన్ మాట్లాడుతూ..మ‌న విద్యార్థులంద‌రూ మైక్రోసాఫ్ట్‌ సీఈవో స‌త్య‌నాదెళ్ల‌ లాగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. జ‌గ‌న‌న్న విదేశీ విద్య ప‌థ‌కాన్ని కూడా తీసుకొచ్చామ‌న్నారు. ఇచ్చిన‌ మాట మేరకు సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జగనన్న వసతి దీవెన అమలు చేస్తున్నామ‌న్నారు.

చదువు ఓ కుటుంబ చరిత్రనే కాదు.. ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే మా తాపత్రయం. ఈ నాలుగేళ్లలో నాణ్యమైన విద్య అందించే విధంగా.. విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు.. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నాం. ఇది జగనన్న విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పీజు రీయంబర్స్‌మెంట్‌ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.