తప్పు చేశామని గ్రహించే స్థితిలో అధికార పక్షం లేదు : యనమల

ప్రజల తరఫున ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటామన్న టీడీపీ నేత

అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైస్సార్సీపీ నేతలు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు సభను అవమానిస్తూ ఆనందించే స్థాయికి దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో అసెంబ్లీ సమావేశాలను దూషణ పర్వంగా మార్చారని విమర్శించారు. సభలో లేనివాళ్ల గురించి మాట్లాడకూడదన్న మర్యాదను విస్మరించారని మండిపడ్డారు.

సభను నియంత్రించే పరిణామాలు లేనప్పుడు బహిష్కరించక ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుండడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజల తరఫున పోరాడుతామని అన్నారు. తప్పు చేశామని గ్రహించే స్థితిలో అధికార పక్షం లేదన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/