తిరుపతి రుయా ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కలెక్టర్ కు ఆదేశం

AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

Amravati: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయా కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సీఎం కలెక్టర్ ని ఆదేశించారు. ఘటనకు కారణాలను గుర్తించి, మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని , రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆస్పత్రి వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/