అప్పట్లో ఎన్టీఆర్‌ను ఎలా ఏడిపించావో.. ఇప్పుడు నీకు అదే పరిస్థితి వచ్చిందంటూ బాబుపై రోజా కామెంట్స్

అసెంబ్లీ లో వైసీపీ వ్యవహరించిన తీరు ఫై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. తమ అధినేత కన్నీరు పెట్టుకోవడాన్ని టీడీపి నేతలు , కార్యకర్తలు తట్టుకోలేకపోతుంటే..వైసీపీ నేతలు మాత్రం సింపతీ కోసం చంద్రబాబు కన్నీరు డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేసారు. ఇక నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం తనదైన స్టయిల్ లో కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. విధి ఎవరినీ విడిచిపెట్టదనీ, అందరి సరదా తీర్చేస్తుందనీ, ఇప్పుడు చంద్రబాబుకు అదే జరిగిందని కామెంట్‌ చేశారు.

అప్పట్లో ఎన్టీఆర్‌ను ఎలా ఏడిపించావో.. నువ్వు ఇప్పుడు ఏడిచే పరిస్థితి వచ్చిందని అన్నారు. మనం ఏం చేస్తే.. మనకు అది తిరిగి వస్తుందన్నారు. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ ఎంత ఏడిపించారో గుర్తుందా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అదే వయసులో.. 71 సంవత్సరాలా 7 నెలలకే ఏడ్చావని చంద్రబాబు ఏడ్చారని.. మనం ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుందని అన్నారు.

‘ఈ రోజు ఏదో నీ భార్యను అనేశారని చాలా బాధపడిపోతున్నావే.. మరీ ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పీతల సుజాతతో రోజా బ్లూ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిందని సీడీల చూపించిన విషయం మర్చిపోయావా..?’ అని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. మాకు ఫ్యామిలీ లేదా..? మాకు కుటుంబం లేదా..? మాకు గౌరవం లేదా.. అని అడిగారు. ప్రధాని మోడీతో సహా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావో తెలుసన్నారు.

‘చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నీ కోసం 10 సంవత్సరాలు పని చేసిన లీడర్‌గా చూడకుండా.. మహిళ అని చూడకుండా నన్ను మానసిక క్షోభకు గురిచేసిన నువ్వు.. నీకు నువ్వే సరైన శిక్ష వేసుకున్నావు..’ అని అన్నారు. రెండున్నరేళ్లు కాదు కదా.. మళ్లీ జీవితంలో అసెంబ్లీకి రాలేవన్నారు. బైబై బాబు.. బైబై అంటూ రోజా సంతోషం వ్యక్తం చేశారు.

కర్మ ఫలితం అనుభవించు బాబు, అధికారం చేతిలో ఉందని మహిళలు అని కూడా చూడకుండా నాడు నన్ను, జగనన్న కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురిచేసింది మరిచిపోయావా? నీ దొంగ ఏడుపులు రాష్ట్ర ప్రజలు నమ్మరు బాబు !#APAssembly #DramaBabuNaidu pic.twitter.com/55IdzkVzdX— Roja Selvamani (@RojaSelvamaniRK) November 19, 2021