కేంద్రమంత్రి జవదేకర్‌తో సీఎం జగన్ భేటీ
cm-jagan-meets-union-minister-javadekar
న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో జగన్ భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎం జగన్ వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి శుక్రవారం తాడేపల్లి చేరుకుంటారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/