13న తెలుగు రాష్ట్రాల సిఎంల భేటి!

కెసిఆర్‌ను ప్రత్యేకంగా కలవనున్న వైఎస్ జగన్

AP, TS CMs Jagan, Kcr met On 24th Sep
AP, TS CMs Jagan, Kcr

అమరావతి: ఏపి సిఎం జగన్‌ తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ప్రత్యేకంగా కలవనున్నారు. ఈ నెల 13న వీరిద్దరి భేటీ హైదరాబాద్ లో జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్యా పలు అంశాలు చర్చకు రావచ్చని సమాచారం. ఏపీ రాజధాని మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్య,లో కేసీఆర్, జగన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ప్రగతి భవన్ వేదిక కానున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/