రైతులు నిరసన దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం తమాషా చేస్తోంది

చంద్రబాబు నాయుడు విమర్శ

Chandra babu Naidu

Amaravati: 250 రోజులుగా అమరావతి రైతులు నిరసన దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం తమాషా చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు .

దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ ఉద్యమం తాను ఎన్నడు చూడలేదన్నారు. అమరావతి ఉద్యకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని దుయ్యబట్టారు.

జగన్ లాంటి పాలకులు కూడా చాలా అరుదుగా ఉంటారు అంటూ ఎద్దేవా చేశారు.

రాజధాని అంశంపై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని విసిరిన సవాల్‌‌‌కు జగన్ ముందుకు రాకపోవడంతో మూడు రాజధానులకు ప్రజా మద్దతు లేనట్టేనని అన్నారు..

అయినా మొండిగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ తీరు నిరంకుశత్వాన్ని తలపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన అమరావతి రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత 13 జిల్లాల ప్రజలపై ఉంది అని చంద్రబాబు అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/