8, 9వ తేదీల్లో కడపలో పర్యటించనున్న సీఎం జగన్

రూ. 400 కోట్ల పనులకు శంకుస్థాపన

అమరావతి : సీఎం జగన్ ఈ నెల 8, 9వ తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 9న బద్వేలులో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. సీఎం అయిన తర్వాత బద్వేలుకు జగన్ తొలిసారి వస్తున్నారు.

జగన్ పర్యటన సందర్భంగా బహిరంగసభ కోసం బైపాస్ రోడ్డులోని ఒక స్థలాన్ని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. హెలిప్యాడ్ కోసం సిద్ధవటంలోని ఓ స్థలాన్ని, మైదుకూరు రోడ్డులోని మరో స్థలాన్ని పరిశీలించారు. దాదాపు రూ. 400 కోట్ల అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/