ఎస్సీ, ఎస్టీలకు ‘కరెంట్’ షాక్ ఇచ్చిన సీఎం జగన్

ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు సీఎం జగన్‌ భారీ షాక్ ఇచ్చారు. జగ్జీవన్ జ్యోతి పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల వరకు ఇచ్చే విద్యుత్ పథకంలోని లబ్ధిదారుల సంఖ్యలో ప్రభుత్వం కోత పెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 22.47 లక్షల కనెక్షన్లకు లబ్ధి చేకూరుతుండగా..వివిధ కారణాలతో 3.93 లక్షల కలెక్షన్లు అనర్హులుగా తేల్చింది ప్రభుత్వం. మొత్తం లబ్ధిదారుల్లో 17.5% ఉచిత విద్యుత్ కు దూరమయ్యారు.

ఆపై ప్రతినెలా వారు వాడిన కరెంటుకు బిల్లులు జారీ అవుతున్నాయి. తొలగించిన వారిలో నిజంగా అనర్హులు ఉంటే ప్రభుత్వ చర్యలను తప్పు పట్టలేము. కానీ, జగ్జీవన్ జ్యోతి పథకం నిబంధనల మేరకు అర్హతలు ఉన్న కొందరు ప్రతినెల బిల్లు చెల్లించాల్సి వస్తోంది. మంగళగిరి మండలం ఎర్రబాలెం ఎస్టీ కాలనీని పరిశీలించగా ఐదు, ఆరు నెలలుగా బిల్లులు వస్తున్నాయని, తమకు ఉచిత విద్యుత్ ఎందుకు ఎత్తేసారో తెలియడం లేదని కొందరు వాపోయారు.