నేడు కామారెడ్డిలో పర్యటించనున్న హరీష్‌ రావు

health-minister-harish-rao-will-visit-kamareddy-today

కామారెడ్డిః వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ను ప్రారంభించనున్నారు. మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

మరోవైపు.. మంత్రి హరీష్ రావు పర్యటన దృష్ట్యా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు, బిజెపి కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని..పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/