తాజ్‌ మహల్‌ను మూసేయండి:ఆగ్రా మేయర్‌ లేఖ

భారత్‌లో కరోనా అదుపులోకి వచ్చేంత వరకు పురాతన కట్టడాలను మూసేయండి..కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఆగ్రా మేయర్

corona virus affect in india
corona virus affect in india

ఆగ్రా: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) భారత్‌ వ్యాప్తిచెందుతున్నా నేపథ్యంలో తాజ్ మహల్ ను మూసేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆగ్రా మేయర్ నవీన్ కుమార్ జైన్ కోరారు. తాజ్ ను చూసేందుకు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని… ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు తాజ్ మహల్ తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ కోట, ఇతర పురాతన కట్టడాలను పర్యాటకులు సందర్శించకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఓ లేఖ రాశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/