అన్యోన్య దాంపత్యానికి

పెళ్లి అదో పవిత్ర బంధం. ఆలూమగలిద్దరూ ఒకరికోసం ఒకరుగా జీవించే అనురాగసాగరం. ఆనంద సంగమం. ఆ అనుబంధం ఆనందమయం కావాలంటే ప్రేమానురాగాలతో పాటు కొత్త దంపతుల మధ్య చక్కటి అవగాహన అవసరం. ఎంత అన్యోన్య దాంపత్యమైనా అప్పుడప్పుడూ కొన్ని కీచులాటలుండకపోవ్ఞ. అలాంటప్పుడు కొన్ని సర్దుబాట్లూ, దిద్దుబాట్లూ ఇద్దరికీ అవసరమే. అయితే కొత్తగా కాపురానికొచ్చిన అమ్మాయికి అంతా కొత్తకొత్తగానే ఉంటుంది.

Happy couple

మీ గత జీవితం గురించి ఆమెతో అన్నీ నిజాలే చెప్పండి. లేదా ఏమీ చెప్పకుండా ఊరుకోండి. అంతేకాని అబద్ధాలు అస్సలు వద్దు. ఒకవేళ అదిగాని బయటపడిందో మీ సంసార నౌక బీటలు వారడం ఖాయం. ఒక్క చిన్న అబద్ధం ఆడి ఆ తరువాత మీరెంత నిజాయితీగా ఉన్నా లాభం ఉండదు. మిమ్మల్ని ఏ విషయంలోనూ ఆమె పూర్తిగా విశ్వసించదు.

ఆమె చేస్తున్న పనిని మెచ్చుకోండి. ఉదాహరణకి ఆరోజు ఆమె ఇల్లు సర్దే కార్యక్రమం పెట్టుకుందనుకోండి. వీలైతే సాయం చేయండి. లేదంటే ‘ఎంత బాగా సర్దావ్ఞ అని చిన్న కాంప్లిమెంట్‌ ఇవ్వండి. ఆమె ఉద్యోగస్థురాలైతే ఆమె పనిని మనస్ఫూర్తిగా గౌరవించండి.

భార్యాభర్తలన్నాక అభిప్రాయభేదాలు రాకుండా ఉండవ్ఞ. ఆ కారణంగా ఎప్పుడైనా చిన్న వాదన జరిగిందనుకోండి. ఆ చిరాకుతో ఆమెను వదలి మీరు బయటకు వెళ్లిపోకండి. సాయంత్రం సరదాగా బయటకు తీసుకెళ్లి మంచి డిన్నర్‌ ఇప్పించి ప్రేమతో మాట్లాడితే అలకమాయమవ్ఞతుంది.

పెళ్లయింది కదాని ఎప్పుడూ ఆమెను అంటిపెట్టుకుని తిరగవద్దు. తన పుట్టింటివాళ్లతో, స్నేహితులతో ఆనందంగా గడిపే అవకాశం ఇవ్వండి. లేదంటే ఆమె ఆనందాన్నంతటినీ మీరే హరించేశారన్న భావన కలగొచ్చు. అలాగే మీకోసం మీరూ కొంత సమయం కేటాయించుకోండి. లేదంటే మీకంటూ స్నేహితులు లేకుండా అయిపోతారు. మరో ప్రమాదం కూడా ఉంది. కొత్త మోజులో బాగా తిరిగి తరువాత మీ వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉంటే పెళ్లయిన మొదట్లో ఉన్నట్లు ఇప్పుడు ఉండటం లేదని అమ్మాయిలు తెగ బాధపడిపోయే అవకాశాలే ఎక్కువ.

ఆమెకు వేరే అమ్మాయిల్ని చూపించి ఆమె ఎంత బాగుందో ఎంత బాగా డ్రెస్‌ చేసుకుంటుందో, ఎంత చక్కగా మాట్లాడుతుందో, అంటూ పొగడ్తల కార్యక్రమాన్ని చేపట్టకండి. మరొకరితో తనను పోల్చి చూడడం ఏ మహిళా సహించదు. అలా చేస్తే అది కచ్చితంగా మీ వైవాహిక జీవితానికి మైనస్సే అవ్ఞతుంది. మీ భార్యకి మీమీద లేనిపోని అనుమానాలు కలిగించినవారవ్ఞతారు. బంధుమిత్రుల ముందు మీ అర్థాంగిని విమర్శించే సాహసం చేయకండి. అలా కానీ చేశారా, మీ కొత్త కాపురం లోని ఆనందానికి అడ్డుకట్ట పడినట్లే. ఈ కాలం అమ్మాయిలు ఈ విషయంలో అస్సలు రాజీపడరు. జాగ్రత్త. ఏవి ఉన్నా మీరిద్దరే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.

కెరీర్‌, డబ్బు, పుట్టింటి ఇబ్బందులు, ఇలా దేనిగురించో తీరని ఆవేదనలో ఉండి ఆమె మీతో బాధను పంచుకుంటుం దనుకోండి. దాన్ని మీరు తేలికగా కొట్టిపారేయడమో, ఉచిత సలహాలివ్వడమో చేయకుండా ఆమె చెప్పేదాన్ని శ్రద్ధగా వినండి. ఆ సమయంలో సలహాలివ్వడం కన్నా సహనంతో వినడమే ఆమెకు ఎంతో ఊరటనిస్తుంది. అలాగే, కొన్ని సందర్భాల్లో ఏదో ముఖ్యమైన విషయం గురించి ఆమె చెబుతూనే ఉంటుంది. మీరు మాత్రం అదేమీ చెవికెక్కించుకోకుండా టీవి చూస్తూనో, పేపరు చదువ్ఞకుంటూనే ఉంటే అవతలి వాళ్లకి అరికాలిమంట నెత్తికెక్కుతుంది. మరోసారి అలాంటి విషయాలు మీతో మాట్లాడరు. వేరే వాళ్లతో చెబుతారు. అప్పుడు ఫీల్‌ అయినా లాభం ఉండదు.

మీ పార్టనర్‌తో ఎవరైనా నవ్ఞ్వతూ మాట్లాడినా ఆప్యాయంగా ఉన్నా చూసి భరించలేకపోతుంటే దాన్ని అసూయ అంటారు. ఇలా కట్టడి చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. భార్య ఆనందంగా ఉండాలనుకోవాలి కానీ ఆమె ఆనందం మీకు మాత్రమే పరిమితం కావాలనుకుంటే అవతలి వ్యక్తులు జైల్లో బంధించినట్లుగా ఫీలయ్యే ప్రమాదం ఉంది.

ఒకరి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకి మరొకరు సంకెళ్లు వేయాలనుకుంటే త్వరలోనే ఇద్దరూ చెరోదారీ కాక తప్పదు. ప్రపంచం మారింది. ఇంటిపనిలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి. లాండ్రీకి బట్టలు ఇద్దరివీ కలిపి ఇవ్వండి. ఆమె టిఫెన్‌ చేస్తుంటే మీరు కాఫీ కలపండి.

భోజనాలయ్యాక ఆమె వంటగది సర్దుకుంటుంటే మీరెళ్లి మంచమెక్కకుండా అలసిపోయి నట్లున్నావ్ఞ, గిన్నెలు నేను సర్దుతాను కాని నువ్వెళ్లి కాస్త ఫ్రెష్‌ అవ్ఞ అని చెప్పండి. అపుడు ఆమె కళ్లలో కనిపించే ఆనందాన్ని గుండె లోతుల్లో భద్రంగా దాచుకోండి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/