‘సర్కిల్’ సినిమా ఆకట్టుకుంటుంది

-హీరోయిన్లు అర్షిణ్ మెహతా, రిచా పనై

దర్శకుడు నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా “సర్కిల్”. ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో తమ అనుభవాలను నాయికలు అర్షిణ్ మెహతా, రిచా పనై తెలిపారు.

‘Circle’ movie heroines Arshin Mehta, Richa Panai interview photo

అర్షిణ్ మెహతా మాట్లాడుతూ సల్మాన్ హీరోగా నటించిన భజ్రంగీ భాయిజాన్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రతో నా కెరీర్ మొదలుపెట్టాను. సర్కిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఇక్కడి చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. నీలకంఠ గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు .

ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్ర చేశానని వివరించారు. హీరో ఫొటోగ్రాఫర్. వీరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుందని . తెలుగు భాష రాదు కాబట్టి సెట్ లో ఇబ్బందిపడేదాన్ని. కానీ డైరెక్టర్ తో సహా టీమ్ చాలా సపోర్ట్ చేసి నేను బాగా నటించేలా చూసుకున్నారని చెప్పారు. మన జీవితం అంటే మంచీ చెడుల సర్కిల్. ఈ చిత్రంలోనూ అదే విషయాన్ని చెప్పబోతున్నామని, సాయి రోనక్ మంచి కోస్టార్. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతనితో కలిసి నటించామన్నారు. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారని ఇక్కడ మంచి అ‌వకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు.

రిచా పనై మాట్లాడుతూ – కెరీర్ లో గ్యాప్ కావాలని తీసుకున్నది కాదని, యముడికి మొగుడు, చందమామ కథలు, ఈడు గోల్ట్ ఎహె వంటి చిత్రాల్లో నటించినట్టు తెలిపారు ‘బృందావనమది అందరిదీ ‘ సినిమాలో నటించినా అది విడుదల కాలేదని, యముడికి మొగుడు, చందమామ కథలు చిత్రాల్లో నటించాక మంచి అవకాశాలు వస్తాయని ఆశించానని, కానీ అనుకున్నంతగా సినిమాలు దక్కలేదన్నారు.

ఇండస్ట్రీకి దూరమవడం ఇష్టం లేక వచ్చిన రెండు మూడు చిత్రాల్లో నటించటం జరిగిదని . ఇప్పుడు సర్కిల్ చిత్రంలో చేశానన్నారు. ఇది జూలై 7న రిలీజ్ కు వస్తోందని, ఈ చిత్రంలో దర్శకుడు నీలకంఠ నా క్యారెక్టర్ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారని తెలిపారు. ఇవాళ అమ్మాయిలు ఎంత మోడరన్ గా, ఫ్రీడమ్ తో ఉన్నారో అలాగే తెరపై కనిపిస్తానని పేర్కొన్నారు. రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్, ఎంటర్ టైనింగ్..ఇలా కథలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని, మాంటేజ్ సాంగ్స్ ఆకర్షణ అవుతాయని చెప్పారు.

తెలంగాణ వార్తల కోసం https://www.vaartha.com/category/telangana/